Our Experts » Dasara 2018 Day Two« Back

శ్రీ బాలాత్రిపురసుందరీదేవి అలంకారం

 

 

 

"హ్రీంకారాసన గర్భితానల శిఖాం
సౌ:క్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణా౦బర ధారిణీం వరసుధాదౌతాం
త్రినేత్రోజ్జ్వలామ్
వందే పుస్తక పాశమంకుశధరాం
స్రగ్భూషితాముజ్జ్వలాం
తాంగౌరీం త్రిపురాం
పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్"

శరన్నవరాత్రి ఉత్సవాలలో  మొదటి రోజు దుర్గమ్మ బాలాత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపురుని భార్య త్రిపుర సుందరీదేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత. కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపురసుందరీదేవి భక్తుల పూజలందుకుంటోంది. ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మ వారి స్వరూపంగా పూజచేసి కొత్త బట్టలు పెట్టాలి. "ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమోనమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అమ్మవారికి పొంగలి నివేదన చెయ్యాలి. త్రిశతీ పారాయణ చెయ్యాలి.

TeluguOne For Your Business
About TeluguOne